తెలంగాణ

telangana

ETV Bharat / state

HPS In Warangal: వరంగల్​లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​కి 50 ఎకరాల ప్రభుత్వ స్థలం - వరంగల్​కు హెచ్​పీఎస్

hyderabad-public-school
hyderabad-public-school

By

Published : Oct 18, 2021, 12:52 PM IST

12:00 October 18

వరంగల్​కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

వ‌రంగ‌ల్ అద్దె భవనంలో నడుస్తున్న హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌(Hyderabad Public School in Warangal)కు ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథ‌మిక స్థాయి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హచ్​పీఎస్(Hyderabad Public School in Warangal)​.. స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. హ‌న్మ‌కొండ జిల్లా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం ఎలుకుర్తి గ్రామంలో 50 ఎక‌రాల ప్ర‌భుత్వ‌ స్థ‌లాన్ని మార్కెట్ రేటుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.  

రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేతుల మీదుగా, రాజ్య‌స‌భ స‌భ్యుల సురేశ్‌రెడ్డి స‌మ‌క్షంలో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్(Hyderabad Public School in Warangal) సొసైటీ వైస్ చైర్మ‌న్‌ గుస్తీ జె. నోరియాకు ఆ జీవోని అంద‌జేశారు. వరంగల్ ప్రజలకు విద్యను మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో స్థలం కేటాయించినట్టు మంత్రి తెలిపారు.  

ఇదీ చదవండి:Revanth reddy tweet: హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ ట్వీట్.. కేటీఆర్​కు ట్యాగ్

ABOUT THE AUTHOR

...view details