గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తెరాస కైవసం - తెలంగాణ వార్తలు
18:51 May 03
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తెరాస కైవసం
మినీపురపోరులో అధికార తెరాస విజయదుందుభి మోగించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లు సహా నకిరేకల్, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలను కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాల్టీలో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇవ్వగా.. వరంగల్‌లో భాజపా, ఖమ్మంలో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచాయి.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు గానూ అధికార తెరాస అభ్యర్థులు 48 డివిజన్లలో విజయం సాధించారు. భాజపా 10 డివిజన్‌లలో గెలుపొందింది. కేవలం 4 చోట్ల మాత్రమే హస్తం అభ్యర్థులు విజయం సాధించారు. ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు నగరపాలికలో జయకేతనం ఎగురవేసిన తెరాస... కారు జోరు తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది.
ఇదీ చదవండి: ఖమ్మం కార్పొరేషన్‌పై ఎగిరిన గులాబీ జెండా