తెలంగాణ

telangana

ETV Bharat / state

'గులాబీ సైనికుడిగా గర్వకారణంగా ఉంది'

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మున్సిపల్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాస్యం వినయ్​ భాస్కర్​ అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

'గులాబీ సైనికుడిగా గర్వకారణంగా ఉంది'
'గులాబీ సైనికుడిగా గర్వకారణంగా ఉంది'

By

Published : Jan 31, 2020, 7:02 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని... ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హన్మకొండ, కాజీపేట్ మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు 2 కోట్ల 96 లక్షల 36 వేల రూపాయల విలువ చేసే 296 చెక్కులను అందించారు. చెక్కులు అందుకుంటున్న వారి కుటుంబాలలో సంతోషాన్ని చూస్తుంటే ఒక గులాబీ సైనికుడిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.

సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ సంచులకు బదులుగా పేపర్ సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. మేడారాన్ని ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతోందని ఆయన అన్నారు.

'గులాబీ సైనికుడిగా గర్వకారణంగా ఉంది'

ఇదీ చూడండి:ఇకపై హైదరాబాద్​లోనే కరోనా టెస్టింగ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details