వరంగల్‌లో ఈనెల 29న నిర్వహించనున్న తెరాస విజయగర్జన (Trs Vijayagarjana) సభ నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లుచేస్తున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో రింగు రోడ్డు పక్కన నిర్వహిస్తున్న సభ స్థలాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పరిశీలించారు. ప్రజలు సభకు చేరుకునే ప్రధాన రహదారులను, పార్కింగ్, సభ స్థలాన్ని పరిశీలించారు.
Trs Vijayagarjana: యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న తెరాస విజయగర్జన సభ ఏర్పాట్లు - హనుమకొండ జిల్లా వార్తలు
తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన (Trs Vijayagarjana) సభ ఏర్పాట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక రైతుల సమ్మతితోనే భూములను తీసుకుని పనులను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కొంత మంది కావాలని అనుమానాలను రేకిత్తించారని అన్నారు. సభకు 10 లక్షల మంది వచ్చే ఆవకాశం ఉందని పేర్కొన్నారు.
![Trs Vijayagarjana: యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న తెరాస విజయగర్జన సభ ఏర్పాట్లు Trs Vijayagarjana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13567118-142-13567118-1636278986138.jpg)
స్థానిక రైతుల సమ్మతితోనే ఈ భూములలో సభను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పనులు కూడా మొదలు పెట్టామని పేర్కొన్నారు. కొంత మంది కావాలని అనుమానాలను రేకిత్తించారని అన్నారు. సభకు 10 లక్షల మంది వచ్చే ఆవకాశం ఉందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదిస్తారని తెలియజేశారు.
ఇదీ చదవండి:Kishan Reddy Comments: 'రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రాబోతోంది'