తెరాస ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణి దేవీల గెలుపుని పురస్కరించుకుని వరంగల్ జిల్లా హన్మకొండలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవాల్లోమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రమేష్, నరేందర్ పాల్గొన్నారు.
ఎన్నికేదైనా గెలుపు తెరాసదే: ఎర్రబెల్లి దయాకర్ రావు - ministre yerrabelly dayakar
వరంగల్ జిల్లాలో తెరాస శ్రేణులు ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రమేష్, నరేందర్ పాల్గొన్నారు.
ఎన్నికేదైనా గెలుపు తెరాసదే: ఎర్రబెల్లి దయాకర్ రావు
బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పట్టభద్రులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ విజయంతో రాష్ట్రంలో ఎన్నికేదైనా గెలుపు తెరాసదేనని మరోసారి రుజువైందని చెప్పారు.
ఇదీ చదవండి:పెద్దయ్యగుట్ట.. రైతుల కోర్కెలు తీర్చునంట!