TRS Celebrations: తెరాస.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడంతో... గులాబీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెరాస శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న క్యాంపు కార్యాలయంలో... బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సిద్దిపేటలో భారాస శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దేశ్ కి నేత కేసీఆర్ అంటూ.. గులాబీ శ్రేణుల నినాదాలతో హోరెత్తింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తెరాస కార్యకర్తలు.. మిఠాయిలు పంచుకుని.. నృత్యాలతో సందడి చేశారు. నిజామాబాద్ జిల్లాలో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా క్యాంపు కార్యాలయంలో... భారీ కేసీఆర్ చిత్ర పటాన్ని చిత్రీకరించారు. హైదరాబాద్‌కు చెందిన కళాకారుడు 10 గంటల పాటు శ్రమించి చిత్ర పటాన్ని సిద్ధం చేశారు.