కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు తెరాస ఇన్సూరెన్స్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం కడిపికొండలోని మృతుల ఇంటింటికీ వెళ్ళి చెక్కులు అందించారు. బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి రూ.15లక్షల పరిహారం చెల్లించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
బోటు ప్రమాద బాధితులకు తెరాస బీమా చెక్కులు... - TRS Insurance Cheques for Boat Accident Victims families ...
కచ్చలూరు బోటు ప్రమాద మృతుల కుటుుంబాలకు తెరాస తరఫున ఇన్యూరెన్స్ చెక్కులు అందించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందించారు.
TRS Insurance Cheques for Boat Accident Victims families ...
తెరాస సభ్యత్వం ఉన్న 5 కుటుంబాలకు లెబర్ ఇన్సూరెన్స్ నుంచి అదనంగా రూ. 6లక్షల 30వేల చెక్కులు అందించినట్లు వివరించారు. ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటానని రమేశ్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన
TAGGED:
Chekkula pampini