తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ 44 వ డివిజన్​లో జోరుగా తెరాస అభ్యర్థి ప్రచారం - greater warangal election campaign news

వరంగల్​ మున్సిపల్​ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల అభ్యర్థులు తమ తమ డివిజన్లలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాజీపేట మండలంలోని 44వ డివిజన్​లో తెరాస అభ్యర్థి కంకణాల శ్రీదేవి ఓట్లు అభ్యర్థించారు.

trs candidate campaign in 44th division of warangal
వరంలగ్​ 44వ డివిజన్​లో తెరాస అభ్యర్థి ప్రచారం

By

Published : Apr 23, 2021, 1:08 PM IST

వరంగల్ బల్దియా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే తమ తమ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.

కాజీపేట్ మండలం కడిపికొండ 44వ డివిజన్ తెరాస అభ్యర్థి కంకణాల శ్రీదేవి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. డప్పు చప్పుళ్లతో వీధివీధి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: మానేరు వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details