వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం... వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వీరభద్రస్వామి అవహనతో... వీరముచ్చు వంశస్థులు డప్పుచప్పుళ్ల మధ్య వీరభద్ర ఖడ్గలతో నృత్యాలు చేశారు. వీరభద్ర స్వామి నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది.
ఘనంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం - kothakonda veerabhadra swamy temple festival
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం... వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా జరిపారు. వేద మంత్రాలు, వీరభద్ర స్వామి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
![ఘనంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం trishul snanam in kothakonda veerabhadra swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10278244-862-10278244-1610897688773.jpg)
trishul snanam in kothakonda veerabhadra swamy temple
వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వీరభద్ర నామస్మరణతో ఆలయ కొలనులో త్రిశూల స్నానం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చూడండి: ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర
TAGGED:
Thrishula snanam