తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ చిన్నమ్మ' మరణం తీరని లోటు - sushma swaraj nivalalu

మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్​ మృతి పట్ల వరంగల్​ అర్బన్​ జిల్లా భాజపా కార్యకర్తలు నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్​ వెలుపల, లోపల తమ గళాన్ని వినిపించారని కొనియాడారు.

'తెలంగాణ చిన్నమ్మ' మరణం తీరని లోటు

By

Published : Aug 7, 2019, 4:46 PM IST

భాజపా సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. హన్మకొండలోని భాజపా పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 'తెలంగాణ చిన్నమ్మ'గా పేరొందిన సుష్మాస్వరాజ్ మృతి చెందడం దేశానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ వెలుపల,లోపల తమ గళాన్ని వినిపించారని చెప్పారు.

'తెలంగాణ చిన్నమ్మ' మరణం తీరని లోటు

ABOUT THE AUTHOR

...view details