తెలంగాణ

telangana

వారి కుటుంబాలను ఆదుకోవాలి: విద్యుత్‌ సంఘాలు

By

Published : Aug 25, 2020, 1:08 PM IST

శ్రీశైలం అగ్నిప్రమాదంలో అమరులైన విద్యుత్‌ ఉద్యోగులకు హన్మకొండలో పలు విద్యుత్‌ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు శాఖాపరమైన ప్రోద్బలంతో పాటు విద్యుత్ సంస్థలో ఉద్యోగం, నివాస స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో 9 మంది విద్యుత్ ఉద్యోగులు చనిపోవడం ఎంతో కలవరపరిచిందన్నారు.

వారి కుటుంబాలను ఆదుకోవాలి: విద్యుత్‌ సంఘాలు
వారి కుటుంబాలను ఆదుకోవాలి: విద్యుత్‌ సంఘాలు

శ్రీశైలం ప్రమాదంలో విధి నిర్వహణలో అమరులైన విద్యుత్ ఉద్యోగులకు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని విద్యుత్ ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పలు విద్యుత్ సంఘాలు నివాళులు అర్పించాయి.

ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని కోరుకున్నారు. బాధిత కుటుంబాలకు శాఖాపరమైన ప్రోద్బలంతో పాటు విద్యుత్ సంస్థలో ఉద్యోగం, నివాస స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో 9 మంది విద్యుత్ ఉద్యోగులు చనిపోవడం ఎంతో కలవరపరిచిందన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని కొనియాడారు. తప్పకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ABOUT THE AUTHOR

...view details