కళాశాలలో సంబురాలు...! - VILLAGE
నిత్యం చదువులతో తీరిక లేకుండా ఉండే కళాశాల పండుగలకు నెలవైంది. విద్యాలయం కాస్తా... పల్లె రంగు పులుముకుంది. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు దేశ సంప్రదాయ దుస్తులతో కనులవిందు చేశారు.

హోరెత్తించిన సంప్రదాయ ఉత్సవాలు..!
హోరెత్తించిన సంప్రదాయ ఉత్సవాలు..!
దేశంలోని పలు రాష్ట్రాల్లో చేసుకునే పండుగలను ఘనంగా జరుపుకున్నారు. అమ్మాయిలు నృత్యాలతో హోరెత్తించారు.
అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వేడుకలు ఉపయోగపడతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
పాశ్చాత్య సంస్కృతివైపు పరుగులు పెడుతున్న యువతకు దేశ సంప్రదాయాలు, పండుగలను మరోసారి గుర్తు చేసేందుకు ఏటా... ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది.
Last Updated : Feb 16, 2019, 11:44 PM IST