రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ నగరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల దిల్లీ నుంచి నగరానికి వచ్చిన పౌరులపై అధికారులు దృష్టి సాధించారు. 19 మందిని గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ... వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వరంగల్ నగరంలోని చార్ బౌలిలో ఓ వ్యక్తిని తరలించారు.
దిల్లీ ప్రార్థనలో పాల్గొన్న వారికి ఎంజీఎంలో చికిత్స - వరంగల్లో వైద్య శాఖ అప్రమత్తం
రాష్ట్రంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే దిల్లీ ప్రార్థనలో పాల్గొని వచ్చిన వారందరినీ ఎంజీఎం ఆసుపత్రి ఐసోలేషన్ గదికి తరలించారు.
![దిల్లీ ప్రార్థనలో పాల్గొన్న వారికి ఎంజీఎంలో చికిత్స వరంగల్ వైద్య శాఖ అప్రమత్తం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6634594-thumbnail-3x2-mgm.jpg)
వరంగల్ వైద్య శాఖ అప్రమత్తం
నిజాంపూర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. రంగంపేటలో మరో వ్యక్తిని తరలించిన అధికారులు ఎల్బి నగర్లోని ఒక వ్యక్తిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారందరూ ఇటీవలే దిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చానవారేనని వైద్యులు తెలిపారు. అనుమానిత కేసులుగా గుర్తించి వారి నమూనాలను సేకరించారు. ప్రస్తుతం వారికి ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు.