తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో నిరుపేదలకు ట్రాన్ జెండర్ల సాయం - వరంగల్​లో నిరుపేదలకు ట్రాన్ జెండర్ల సాయం

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ట్రాన్ జెండర్లు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. సుమారు 300 కుటుంబాలకు కూరగాయలు, వంటింటి సామగ్రిని అందించారు.

నిరుపేదలకు, వృద్ధులకు నిత్యావసర సరకుల పంపిణీ
నిరుపేదలకు, వృద్ధులకు నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Apr 8, 2020, 10:48 AM IST

లాడ్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, నిరుపేదలకు ట్రాన్స్ జెండర్లు అండగా నిలిచారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని శివనగర్​లో 300 నిరుపేద కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వృద్ధులకు సరకులతో పాటు 500 రూపాయల నగదు అందజేశారు. ఆపత్కాలంలో అవసరమైన వంటింటి సామగ్రిని పంపిణీ చేసిన ట్రాన్స్ జెండర్ల సేవా భావాన్ని స్థానికులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత శుభ్రత తప్పనిసరిగా పాటించాలని కోరారు. భౌతిక దూరంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించగలమని అన్నారు.

నిరుపేదలకు, వృద్ధులకు నిత్యావసర సరకుల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details