ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ అన్నారు. ప్రజల్లో తెరాస ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాంగ్రెస్ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వరంగల్ మేయర్ పీఠం కాంగ్రెస్‌దే: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ - వరంగల్ లేటెస్ట్ న్యూస్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. హన్మకొండ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వరంగల్ మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా మాటలతో తెరాస ప్రభుత్వం మభ్య పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే నిధులు కేటాయిస్తామని చెప్తున్నారని విమర్శించారు. వరంగల్‌కు ఇస్తామన్న రూ.300 కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం