తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదారిలో పడవ ప్రమాదం.. 8 మంది మృతి - boat

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో పర్యాటక బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 72 మంది పర్యాటకులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

పడవ

By

Published : Sep 15, 2019, 7:13 PM IST

Updated : Sep 16, 2019, 4:43 AM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో పెను విషాదం చోటుచేసుకుంది. దేవీపట్నం మండలం కచులూరు మందం వద్ద గోదావరిలో బోటు ఘోర ప్రమాదానికి గురైంది. బోటులో మొత్తం 72 మందితో పాపికొండలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గోదావరిలో ఇప్పటివరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. 16 మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటులో చిన్నపిల్లలతో సహా 63 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో హైదరాబాద్‌కు చెందిన 22 మంది, వరంగల్​కు చెందిన 14 మంది పర్యాటకులు ఉన్నారు. ప్రయాణికులంతా ఒకేవైపు రావడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Last Updated : Sep 16, 2019, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details