తెలంగాణ

telangana

ETV Bharat / state

అతి తక్కువ ఖర్చుతో టచ్​లెస్​ శానిటైజర్​

కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు అతి తక్కువ ఖర్చుతో టచ్​లెస్​ శానిటైజర్​ను రూపొందించారు వరంగల్​ నిట్​కు చెందిన ఉద్యోగి. బయట మార్కెట్​లో దీని విలువ రూ. 2వేలు ఉండగా ఆయన రూ. 800కే ఈ శానిటైజర్​ను అందుబాటులోకి తెచ్చారు.

touchless sanitizer
టచ్​లెస్​ శానిటైజర్​

By

Published : Apr 9, 2021, 12:03 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా కేంద్రంలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(నిట్)​లో టచ్ లెస్ శానిటైజర్​ను రూపొందించారు. ఈసీఈ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న వి. సుధాకర్ అతి తక్కువ ఖర్చుతో దీనిని తయారుచేశారు. అల్ట్రాసోనిక్ సెన్సార్ మైక్రో కంట్రోలర్, ఎల్ఈడీ సోలినోయిడ్ సిద్ధాంతం ప్రకారం ఈ శానిటైజర్​ను రూపొందించినట్లు సుధాకర్​ తెలిపారు. బయట మార్కెట్లో దీని విలువ రూ.2 వేలు ఉండగా తాను తయారు చేసిన శానిటైజర్​ను కేవలం రూ.800 అందుబాటులోకి తేవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో టచ్​లెస్​ శానిటైజర్​

కొవిడ్​ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో తక్కువ ఖర్చుతో శానిటైజర్ అందుబాటులోకి తీసుకువచ్చిన సుధాకర్​ను నిట్ డైరెక్టర్ ఆచార్య ఎన్.వి.రమణారావు, రిజిస్ట్రార్ ఎస్. గోవర్దనరావు అభినందించారు.

ఇదీ చదవండి:కరోనా కట్టడికి పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details