వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలో నిర్మాణం చేపడుతున్న కాళోజీ కళాక్షేత్రం పనులను మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కళాక్షేత్రం నిర్మాణ పనులు వేగవంతం చేయండి: పురపాలక కమిషనర్ - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పురపాలక కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలో కొనసాగుతున్న పనులను ఆమె పరిశీలించారు.
కళాక్షేత్రం నిర్మాణ పనులు వేగవంతం చేయండి: పురపాలక కమిషనర్
నాణ్యతలో రాజీ పడకుండా భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాక్షేత్రంతో పాటు పబ్లిక్ గార్డెన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.