వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్‌లో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కాంట్రాక్ట్ లెక్చరర్ మహేందర్ కుటుంబాన్ని తెజస అధ్యక్షుడు కోదండరాం పరామర్శించారు. మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా మహేందర్.. మహబూబాబాద్‌లో ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తించాడని తెలిపారు.
కాంట్రాక్ట్ లెక్చరర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: కోదండరాం - tjs president kodandaram
కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్‌లో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కాంట్రాక్ట్ లెక్చరర్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.
తెజస అధ్యక్షుడు కోదండరాం
ప్రభుత్వానికి మహేందర్ అందించిన సేవలను గుర్తించి .. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. మహేందర్ భార్యకు ఒప్పంద ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సర్కార్.. కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి :ఎయిమ్స్‌లో కిషన్ రెడ్డి.. వైద్యులతో సమీక్ష