తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళల రక్షణకు పకడ్బందీ ప్రణాళిక అవసరం' - తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదంరాం

దిశ ఎన్​కౌంటర్​ ద్వారానే మహిళలకు న్యాయం జరగలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆడవారి రక్షణకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tjs president kodandaram demands women commission in telangana for women safety
మహిళల రక్షణకు పకడ్బందీ ప్రణాళిక అవసరం'

By

Published : Dec 7, 2019, 3:26 PM IST

మహిళల రక్షణకు పకడ్బందీ ప్రణాళిక అవసరం'

దిశ ఎన్​కౌంటర్​తో కొందరికి మాత్రమే న్యాయం జరుగుతుందని, అందరికి న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మహిళా కమిషన్​ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

హత్యాచారాలకు బలైన మహిళలందరికీ ఒకే విధంగా న్యాయం జరగాలని కోరారు. ఇటీవలి వరంగల్​లో హత్యాచారానికి గురైన యువతి ఘటనలో విచారణ ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.

దిశ ఘటనలో ఏ విధంగా సత్వర న్యాయం చేశారో.. తన కూతురి విషయంలో కూడా నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details