వరంగల్ నగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాశీబుగ్గలో వివేకానంద కళాశాల మైదానం నుంచి ఎంజీఎం వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 180 మీటర్ల జాతీయ పతాకంతో దేశభక్తిని చాటేలా నినదిస్తూ ముందుకు సాగారు.
వరంగల్లో తిరంగా ర్యాలీ - అఖిల భారత విద్యార్థి పరిషత్
వరంగల్లో దేశభక్తిని చాటుతూ.. విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
తిరంగా ర్యాలీ