వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు. వాడవాడలా పటిష్ఠ బందోబస్త్ చేపట్టారు. ఈటలపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన వద్ద నుంచి వైద్యఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ అయింది.
ఈటల సొంత గ్రామంలో పోలీసుల బందోబస్త్ - Huge provision at the house of the minister
ఈటల రాజేందర్‌పై భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఆయన సొంత గ్రామమైన కమలాపూర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఈటల అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల, తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, మంత్రి ఈటల, ఈటల సొంత గ్రామంలో బందోబస్త్
ఈ క్రమంలో కమలాపూర్‌లోని ఈటల ఇంటివద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై ఈటల అంటూ హోరెత్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈటల ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.