వరంగల్‌కు చెందిన పస్తం రమేశ్ పదకొండేళ్ల ప్రాయం వరకు బాగానే ఉన్నాడు. తర్వాత పోలియో సోకడంతో కుడికాలు పనిచేయక దివ్యాంగుడయ్యాడు. అయినా ఆత్మవిశ్వాసంతో 2017లో వరంగల్ ఎల్‌బీ కళాశాలలో ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేశారు. రమేశ్ భార్య అనారోగ్యానికి గురికావడంతో కొన్నాళ్లు ఆసుపత్రుల వెంట తిరిగాడు. కుదుటపడ్డాక ఉద్యోగ వేటలో వరంగల్, హైదరాబాద్‌లలోని ప్రముఖ కంపెనీలను సంప్రదించగా నిరాశే ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో హమాలీగా పనిచేస్తున్నాడు.
చదివింది ఎంబీఏ.. చేస్తుంది హమాలీ..!
కూలీలుగా తల్లిదండ్రులు పడ్డ పాట్లను చూస్తూ పెరిగాడు.. కుటుంబ కష్టాలు తొలగాలంటే చదువొక్కటే మార్గమని నమ్మాడు.. దివ్యాంగుడైనా కష్టపడి ఎంబీఏ పూర్తిచేశాడు. కానీ, ఒక్క ఉద్యోగ మూ వరించలేదు. శరీరం సహకరించకున్నా గతిలేని పరిస్థితుల్లో తండ్రి చేస్తున్న హమాలీ వృత్తిలోకే వచ్చాడు. కుటుంబాన్ని భారంగా మోస్తున్నాడు.
hamali
సాధారణంగా హమాలీలు రోజుకు వందకు పైగా బస్తాలు మోయగలుగుతారు. కానీ, సరిగా రమేశ్ 20 బస్తాలకు మించి మోయలేడు. ఫలితంగా రోజుకు రూ.100కు మించి కూలీ రావడం లేదని, కుటుంబపోషణకు ఏమాత్రం చాలటం లేదని ఆవేదన చెందుతున్నారు. ట్యాలీ, ఎంఎస్ ఆఫీస్ వంటి కంప్యూటర్ కోర్సులూ నేర్చుకున్న తనకు ఏ చిన్న ఉద్యోగం లభించినా కష్టాలు కొంతయినా తీరుతాయని రమేశ్ అంటున్నారు.
ఇదీ చూడండి:Civils toppers interview: రెండుసార్లు విఫలమైనా.. ముచ్చటగా మూడోసారి సఫలం..