ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సహస్ర కలశాభిషేకంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు పదిహేను రోజులపాటు కన్నుల పండువగా జరుగనున్నాయి.
భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం - శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తొలిరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

భద్రకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం
చివరిరోజు అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు కరోనా వైరస్ కారణంగా సాదా సీదాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.