వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో భారీ నష్టం సంభవించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నగరంలోని ప్రధాన నాళాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇంత పెద్ద నష్టం జరిగిందన్నారు. వరంగల్ నగరంలో ముంపునకు గురైన అమరావతినగర్ దీన్దయాల్ నగర్ రంగంపేట శివనగర్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను గమనించారు.
అలా చేస్తే సహించం...