గ్రేటర్ వరంగల్ పరిధిలో 417 అక్రమ నిర్మాణాలను గుర్తించామని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ తెలిపారు. నాలాలపై అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు.
'వరంగల్లో నాలాలకు ఇరువైపులా బఫర్ జోన్ల ఏర్పాటు' - వరంగల్లో మేయర్ గుండా ప్రకాశ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు
వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలిగిస్తున్నట్టు మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు. వివిధ డివిజన్లలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'వరంగల్లో నాలాలకు ఇరువైపులా బఫర్ జోన్ ఏర్పాటు'
నాలాలకు ఇరువైపుల 30 ఫీట్లతో బఫర్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు.
ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్