గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను మంత్రి సత్యవతి రాఠోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి ప్రకటించారు. నియోజక వర్గాల వారీగా అభ్యర్థుల పేర్లు ప్రకటించి... బీఫారాలు అందించారు.
గెలుపు మాదే..
వివిధ సమీకరణాల వల్ల అందరికీ అవకాశం కల్పించలేకపోయామని మంత్రి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎవరూ తమకు పోటీ కాదని.. ప్రభుత్వం చేసిన అభివృద్ధే తెరాస అభ్యర్థులను గెలిపిస్తుందని మంత్రి సత్యవతి, ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.