ఆరునెలల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
డెబ్భై ఏళ్లలో చూడనిది... ఆరునెలల్లో: ఎమ్మెల్యే నరేందర్ - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు
డెబ్భై ఏళ్లలో చూడని అభివృద్ధి కేవలం ఆరునెలల్లో చేసి చూపిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
డెబ్భై ఏళ్లలో చూడనిది... ఆరునెలల్లో: ఎమ్మెల్యే నరేందర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. శంకుస్థాపన చేసిన రోడ్డు పనులను రెండు రోజుల్లోనే పూర్తి చేసి జవాబుదారీగా ఉంటానని తెలిపారు. తన నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.