ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదలిస్తుందని ప్రజాకవి కాళోజీ అనేవారు. ఆయన రచనల్లో విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి సముచిత గౌరవం ఇచ్చింది. ఈ విద్యాలయ భవనాన్ని వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో సర్వ హంగులతో నిర్మిస్తున్నారు. రూ. 23 కోట్లతో పదెకరాల్లో ఈ భవనం దాదాపు పూర్తికావొచ్చింది. త్వరలో యూనివర్సిటీ ఈ భవనంలో కొలువుదీరబోతోంది.
Kaloji: సిద్ధమైన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనం - telangana news
తెలంగాణ ప్రజల గొంతుకగానే ఉన్న కాళోజీ నారాయణరావుకు రాష్ట్ర ఆవిర్భావం తరువాత సముచిత గౌరవం లభిస్తుంది. త్వరలోనే వరంగల్‌లో కాళోజీ పేరు మీద ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనం కొలువదీరనుంది.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం