వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో జిల్లా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇంతకాలం లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాన రహదారులపై కనిపించిన కర్ఫ్యూ వాతావరణం. ప్రస్తుతం ఎండ కారణంగా కనిపిస్తోంది. మరో రెండు రోజులు ఇలాంటి వాతావరణమే కొనసాగి సూర్యుడి ప్రతాపం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
భగ్గుమంటున్న సూర్యుడు
ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తుంది.వారం రోజులుగా 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హన్మకొండలోని ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండ తీవ్రతకు జనాలు అల్లాడుతున్నారు. బయటకు వచ్చిన వ్యక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక నిమ్మకాయ రసం, కొబ్బరి బొండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
ఇదీ చూడండి:చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు