ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన అధికార పార్టీ నేతల ఇంటి ముట్టడిలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నేతలను మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
నన్నపనేని ఇంటి ముట్టడికి యత్నించిన నాయకుల అరెస్ట్ - నన్నపనేని ఇంటి ముట్టడికి యత్నించిన నాయకుల అరెస్ట్
వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
![నన్నపనేని ఇంటి ముట్టడికి యత్నించిన నాయకుల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5026904-276-5026904-1573457881501.jpg)
నన్నపనేని ఇంటి ముట్టడికి యత్నించిన నాయకుల అరెస్ట్
గత నెలరోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేస్తూ... మద్దతిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం తప్పన్నారు.
నన్నపనేని ఇంటి ముట్టడికి యత్నించిన నాయకుల అరెస్ట్
ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైల్