వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో వరంగల్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని కోరుతూ సైకిల్ ర్యాలీ చేపట్టారు. వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
'వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం' - ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తాజా వార్తలు
వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో వరంగల్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని కోరుతూ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
'వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'
ఇలాంటి కార్యక్రమాల వల్ల కాలుష్యం తగ్గి, ఆరోగ్య నగరం తయారవుతుందని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. పర్యావరన పరిరక్షణ అందరి బాధ్యత అని.. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలకు కార్పొరేటర్లందరూ వాహనాల్లో కాకుండా.. సైకిళ్లపై హాజరు కావాలని కోరారు.
ఇదీచూడండి.. గంగపుత్ర యువజన సంఘం అధ్యక్షుడిగా ప్రణీత్ నియామకం