తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మె 12వ రోజు.. కొనసాగుతున్న నిరసనలు - RTC workers' strike in Telangana reached 12th day today

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 12వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ సమ్మెను కొనసాగిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె 12వ రోజు.. కొనసాగుతున్న నిరసనలు

By

Published : Oct 16, 2019, 10:04 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మె 12 రోజులకు చేరుకుంది. విధులు బహిష్కరించి కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్​కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. బస్సులను అధిక సంఖ్యలో తిప్పుతున్నా ప్రయాణికులు మాత్రం తక్కువ స్థాయిలో ఉంటున్నారు. కోట్లలో నష్టం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె 12వ రోజు.. కొనసాగుతున్న నిరసనలు

ఇదీ చూడండి : వేడెక్కిన హుజూర్​నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details