వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట శివారు పంట పొలాల్లో పులి సంచారం కలకలం రేపింది. పొలాల్లో పులి కనిపించిందని జిల్లా అటవీ శాఖ అధికారులకు కొంత మంది గ్రామస్థులు సమాచారం ఇచ్చారు.
అవి పులిముద్రలు కావు..అడవి పిల్లి కావచ్చు: అటవీ అధికారులు ఆనవాళ్ల పరిశీలిన..
విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు.
అవి పులిముద్రలు కావు..అడవి పిల్లి కావచ్చు: అటవీ అధికారులు అడవిపిల్లి కావచ్చు...
ఇవి పులి ముద్రలు కావని... అడవి పిల్లి కావచ్చునని అధికారులు పేర్కొన్నారు. పులి సంచారం ఊహగానాల నేపథ్యంలో ఉదయం నుంచి గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ కావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అవి పులిముద్రలు కావు..అడవి పిల్లి కావచ్చు: అటవీ అధికారులు ఇవీ చూడండి : కూర బాగా వండలేదని తల్లి గొంతు కోసిన కొడుకు