వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడి బాట పట్టారు. వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు కొంచెం బాధపడుతున్నప్పటికీ... మళ్లీ స్నేహితులను కలుస్తామని ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తోంది. హన్మకొండలోని ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పుస్తకాల బరువులు మోయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
కొంచెం బాధ... మరికొంచెం ఆనందం - బడిబాట
ఇన్నాళ్లు ఇంట్లో ఆనందంగా గడిపిన పిల్లలు నేడు పాఠశాలలు ప్రారంభమవడంతో బ్యాగులతో మళ్లీ బడిబాట పట్టారు.
కొంచెం బాధ... మరికొంచెం ఆనందం