వరంగల్ అర్బన్ జిల్లాలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ధర్నాకు దిగారు. తెరాస ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగ సమస్య తీరలేదని విమర్శించారు. ఏబీవీపీ నిరసనతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు.
'ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి' - warangal urban
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని.. వెంటనే కొలువుల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు