తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగిన విద్యార్థులు

పాలిసెట్ పరీక్షకు 10 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. వారిని అధికారులు అనుమతించలేదు. కొవిడ్​ ప్రభావంతో రవాణా సౌకర్యాలు లేక సమయానికి చేరుకోలేక పోయమాని వేడుకున్నా కనికరించలేదు. ఈ తరుణంలో విద్యార్థులు ఏడుస్తూ వెనుదిరిగారు. ఈ సంఘటన హన్మకొండలోని చైతన్య డిగ్రీ కళాశాలలో జరిగింది.

ten members Students turned away in tears at hanamkonda
కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగిన విద్యార్థులు

By

Published : Sep 2, 2020, 1:09 PM IST

కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగిన విద్యార్థులు

వరంగల్ నగరంలో నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 10 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. 15 నిముషాలు లేటుగా రావడం వల్ల విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. హన్మకొండలోని చైతన్య డిగ్రీ కళాశాలలో జరిగిన పాలిసెట్ పరీక్షకు 10 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు.

అధికారులు వారిని లోపలకి అనుమతించ లేదు. కరోనా ప్రభావంతో రవాణా సౌకర్యం లేక సరైన సమయానికి చేరుకోలేకపోయామని పరీక్షకు అనుమతించాలని విద్యార్థులు వేడుకున్నారు. అయినా అధికారులు నిరాకరించడం వల్ల విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ తిరిగి వెళ్లిపోయారు.

ఇదీ చూడండి :తొలిరోజు ఆన్ లైన్ తరగతులకు 48 వేల మంది విద్యార్థులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details