రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. వరంగల్ పట్టణ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామిని శ్రీధర్‌బాబు దర్శించుకున్నారు.
ఆలయాలను అభివృద్ధి చేయాలి: శ్రీధర్ బాబు - వరంగల్ అర్బన్ జిల్లా లేటెస్ట్ వార్తలు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంతో పాటు రాష్ట్రంలోని మిగతా ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆయన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయాలను అభివృద్ధి చేయాలి: శ్రీధర్ బాబు
ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. యాదాద్రి తరహాలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'