తెలంగాణ

telangana

ETV Bharat / state

'జిల్లాలో టెలి మెడిసిన్‌ కేంద్రం వినియోగించుకోవాలి' - వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం

కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో కొవిడ్​ పాజిటివ్​ లక్షణాలు ఉన్నవారు లేదా అనుమానితులు హోం ఐసోలేషన్​ ద్వారా చికిత్స చేసుకోవచ్చు. అందుకోసం రాష్ట్రంలో జిల్లాల వారీగా టెలి మెడిసిన్​ సేవలు సహా సందేహాల నివృత్తి కోసం పలు సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు సౌకర్యాలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Telemedicine center, warangal urban district news today
'జిల్లాలో టెలి మెడిసిన్‌ కేంద్రం వినియోగించుకోవాలి'

By

Published : May 7, 2021, 9:11 AM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనివైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో టెలి మెడిసిన్‌ కేంద్రం ఏర్పాటు చేశామని డాక్టర్‌ లలితాదేవి తెలిపారు. ఈ సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. 7995118405, హెల్ప్‌లైన్‌ 7993969104, వాట్సాప్‌ వీడియోకాల్‌ 9392469344 ద్వారా బాధితులతో మాట్లాడుతున్నామని.. ఇప్పటికే 12 మంది సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వాటితోపాటు జిల్లాలో సేవల గురించి వివరాలు వెల్లడించారు.

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు చేపడుతున్నాం. ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నాం. ప్రస్తుతం 4,263 పాజిటివ్‌ కేసులున్నాయి. 729 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, హోం ఐసోలేషన్‌లో 3534, కేయూలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రంలో 27 మంది ఉన్నారు. 170 ప్రైవేటు ఆసుపత్రుల్లో 3,187, ఎంజీఎంలో 800 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. 36 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 1,94,150 మందికి ఇచ్చాం. ప్రభుత్వ సూచన మేరకు టీకాలు ఇస్తున్నాం. 1,360 వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి.
పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బోధనాసుపత్రులు, ఎంజీఎంలో పరీక్షలు చేస్తున్నారు. కిట్ల కొరత లేదు. లక్షణాలున్న వారికి మాత్రమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 596162 మందికి పరీక్షలు చేశాం.

- డాక్టర్‌ లలితాదేవి

ఇదీ చూడండి:కరోనా రోగులకు ప్రత్యేక ఓపీ సేవలు

ABOUT THE AUTHOR

...view details