Telangana Student Prathima Speech in Parliament : తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అవ్వడంతో ముందు నుంచే చదువుపై ఆసక్తి. అంతే కాదు ప్రసంగాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడ వక్తృత్వ పోటీలు జరిగినా పాల్గొని.. తన సత్తా చాటుతూ ఉండేది ఆ విద్యార్థిని. ఈ క్రమంలో జాతీయ స్థాయి(National Level)లో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో పాల్గొని.. మొదటి ర్యాంక్ తెచ్చుకుని తన గుర్తింపుని మరింత పెంచుకుంది. ప్రథమ స్థానం వచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున పార్లమెంట్లో ప్రసంగం ఇచ్చే అవకాశం కొట్టేసింది. ఈ అరుదైన గౌరవం దక్కినందుకున్న ఆ విద్యార్థిని పేరే ప్రతిమ.
Student prathima Select for Gandi jayanthi Speech inParliament : వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన విష్ణుకుమార్ కవిత దంపతులకు కుమార్తె ప్రతిమ. చిన్నతనం నుంచి వక్తృత్వ పోటీల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. అనేక వక్తృత్వ పోటీల(Debate Compitation)లో సత్తా చాటింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో తెలంగాణ నుంచి ప్రథమ స్థానం సాధించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పోటీలు నిర్వహించగా మొత్తం 25 మంది అభ్యర్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వారికి గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంటులో మహనీయులకు శ్రద్ధాంజలి గెలిపించడంతో పాటు ప్రసంగించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
Interview with Poet Pranavi : 'సమాజంలో మార్పు కోసమే నా రచనలు'
NYKS Debate Compitation Winner 2023 Telangana : జిల్లా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ప్రతిమ ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తల్లిదండ్రులు వృత్తిరీత్యా అధ్యాపకులు కావడంతో తనకు ఈ పోటీల్లో మరిన్ని అవకాశాలు కలిసి వచ్చాయని వివరించింది. చిన్నతనం నుంచి తన కుమార్తె వక్తృత్వ వికాస పోటీలతో పాటు వ్యాసరచన పోటీలలో ఆసక్తిగా పాల్గొనేదనితండ్రి విష్ణుకుమార్ తెలిపారు. తమ కుమార్తె ఎంచుకున్న మార్గంలో ప్రయాణించేందుకు అన్ని విధాలుగా సహకరించామని అన్నారు. 2017లో ఎవరికి దక్కని అవకాశం శ్రీహరికోటలో ఇస్రో సాటిలైట్ లాంచింగ్ చూసే అవకాశం దక్కిందని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు.