అదనంగా బస్సులు నడిపినా ఆర్టీసీకి నష్టమే.. - నష్టాల్లో తెలంగాణ ఆర్టీసీ
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బస్టాండ్లో పోలీసులు మోహరించారు.
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండటం వల్ల తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్తోన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అదనపు బస్సులు వేశారు. హైదరాబాద్కు ప్రత్యేకంగా ఎక్కువ బస్సులు నడుపుతున్నారు. ఎన్ని బస్సులు నడిపినా ప్రయాణికులు లేకపోవడం వల్ల ఆర్టీసీ కోట్లలో నష్టం వస్తోంది. సమ్మె ఉద్ధృతం చేసినందున అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బస్టాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
- ఇదీ చూడండి : పదమూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె