వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఉద్యమకారుడు దర్శన్ సింగ్ టికెట్ రాలేదని టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 9వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా తెరాస తరఫున టికెట్ ఆశించి.. రాలేదన్న మనస్తాపంతో టవర్ ఎక్కారు.
టికెట్ రాలేదని టవర్ ఎక్కి ఉద్యమకారుడు నిరసన - తెలంగాణ వార్తలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెరస నేడు అభ్యర్థుల జాబితా ప్రకటించింది. టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో ఉద్యమకారుడు దర్శన్ సింగ్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఉద్యోమ ద్రోహులకు బీఫారాలు ఇచ్చారని ఆరోపించారు.
టవర్ ఎక్కి తెలంగాణ ఉద్యమకారుడు నిరసన, టికెట్ రాలేదని ఉద్యమకారుడు నిరసన
తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారిని పక్కన పెట్టి... ఉద్యమ ద్రోహులకు టికెట్ ఇచ్చారని దర్శన్ సింగ్ ఆరోపించారు. ఈ సంఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు వద్దు.. టవర్ దిగాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి:పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోం: ఎర్రబెల్లి