ర్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలే పండించాలి Nirnajan Reddy About Monsoon Crops : ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు.. చివరకు శ్రమే మిగులుతోంది తప్ప.. దానికి తగ్గ ఫలితం కనిపించట్లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట మార్పిడి ప్రయోజనాలు, డిమాండ్ ఉన్న పంటలసాగు తదితర అంశాలపై.. వానాకాలంలో సాగు సన్నద్ధతపై రైతులకు అవగాహనా కల్పించేందుకు వరంగల్ జిల్లాలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Review on Monsoon Crops : చిన్నదేశాలు కూడా స్పష్టమైన విధానంతో వ్యవసాయంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో అన్ని వనరులు ఉన్నా మనదేశం వెనకబడుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పంటలకైతే డిమాండ్ ఉందో... ఆ పంటలనే పండించేలా రైతులను చైతన్యపరచాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
"దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యవసాయ రంగం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన జరగాలి. అప్పుడే రైతులు స్వేచ్ఛగా సాగు చేస్తారు. పంట బీమాకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన చర్యలు చేపట్టడం లేదు. గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడం దారుణం." - నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
Monsoon Crop Plan in Telangana : రైతులకు అవగాహన కల్పించడాన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని వ్యవసాయశాఖ అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని... ఏ శాఖకూ లేని విధంగా అధిక కేటాయింపులు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.
అవగాహన ఒక్కరోజుతో పూర్తికాదని.. ఏడాదంతా జరగాలని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఏ పంటలు వేస్తున్నారు? దిగుబడి ఎలా వస్తోంది? సాగులో కర్షకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. మొదలైన అంశాలను క్లస్టర్ సిబ్బందితో మాట్లాడించి సంతృప్తి వ్యక్తం చేశారు.