కేంద్ర ప్రభుత్వంతో తగాదా పడాలని తాము ఎప్పుడూ అనుకోలేదని.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి(errabelli dayakar rao news) తెలిపారు. రైతుల కోసమే తాము ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. హనుమకొండలో మంత్రి మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాలను ప్రోత్సహించేందుకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఎర్రబెల్లి (errabelli dayakar rao fires on bjp leader ) అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన.. సాగు, విద్యుత్ చట్టాలను ఒక్క రైతునైనా ఆమోదం తెలపమని కోరగలరా.. అని భాజపా నేతలను ఎర్రబెల్లి ప్రశ్నించారు. అలా అడిగితే భాజపా నేతలను ఉరికించి కొడతారని.. ఎర్రబెల్లి అన్నారు.
తెరాస నిరసన కార్యక్రమంలో రైతులంతా పెద్దసంఖ్యలో (errabelli on trs dharna) పాల్గొని.. వడ్లు ఎందుకు కొనరో భాజపాను నిలదీయాలని మంత్రి కోరారు. కేంద్రం ధాన్యం కొనేవరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రేపటి రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.