వరంగల్ గ్రామీణ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్‌రెడ్డి జెండా ఇన్నోవేషన్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. కొత్త సార్ట్ప్లు.. రూపొందించేందుకు....ఉద్దేశించిన...ఇన్నోవేషన్ యాత్రను రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా నిర్వహిస్తోంది. యాత్రకు ఎంపికైన 120 విద్యార్థులు నాలుగు బృందాలుగా ఏర్పాడి నాలుగు రూట్లలో బస్సుల ద్వారా యాత్ర చేయనున్నారు.
వరంగల్లో ప్రారంభమైన ఇన్నోవేషన్ యాత్ర - ఇన్నోవేషన్ యాత్ర 2020
విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు రూపొందించేందుకు ఉద్దేశించిన ఇన్నోవేషన్ యాత్ర వరంగల్లో ప్రారంభమైంది. యాత్రను వరంగల్ గ్రామీణ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
వరంగల్లో ప్రారంభమైన ఇన్నోవేషన్ యాత్ర
యాత్రలో భాగంగా పలు కాళాశాలల్లో పారిశ్రామిక చర్చలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణల పరిశీలన తదితర ఆంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ యాత్రకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు ఆనంద వ్యక్తం చేశారు. ఈ యాత్ర మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.
ఇవీ చూడండి:కేటీఆర్ జాతీయ పార్టీ పెడితే స్వాగతిస్తాం: కేంద్రమంత్రి పీయూష్