తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై సర్కార్ కొరడా - telangana news

కరోనా వంటి కష్టకాలంలో బాధితుల వద్ద అధిక ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రెండు ప్రైవేట్ హాస్పిటళ్ల కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసింది.

private hospitals, private hospitals scam in telangana
తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులు, తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా

By

Published : Jun 1, 2021, 11:07 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల కొవిడ్ చికిత్సలకు అనుమతిని ప్రభుత్వం రద్దు చేసింది. హన్మకొండలోని మాక్స్ కేర్, లలిత ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కారణంగా వాటిపై కొరడా ఝుళిపించింది.

కరోనా వైద్యానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కొవిడ్ రోగులను చేర్చుకోకుండా ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఆస్పత్రి యాజమాన్యాలు రోగుల నుంచి అధిక ఫీజులు వసూల్ చేస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు సర్కార్ చర్యలు చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details