వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దినసరి కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల వలస కార్మికుల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్రప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: కడియం శ్రీహరి - నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్డౌన్ కారణంగా దేశంలో చాలా మంది పేదవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వలస కార్మికుల కష్టాలను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన వరంగల్లో మండిపడ్డారు.
కేంద్రప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
కేంద్ర ప్రభుత్వం బడా బాబులకు రుణాలు ఎగ్గొట్టి పేద కార్మికులకు మాత్రం మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో కార్మికులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కడియం పేర్కొన్నారు.