దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెరాస సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్ కృషి : ప్రభుత్వ చీఫ్ విప్ - telangana chief whip vinay bhaskar
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులతో పాటు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.. మొక్కలనూ పంపిణీ చేశారు.
- ఇదీ చదవండి :తెరాస మేనిఫెస్టోలో ఈ హామీలే ఉండనున్నాయా!