పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రశ్నించే వారికి పట్టం కట్టాలని తీన్మార్ మల్లన్న కోరారు. హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టిన మల్లన్న.. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. పట్టభద్రులు తప్పకుండా తనను ఆదరించాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రశ్నించే వారికి పట్టం కట్టాలి: తీన్మార్ మల్లన్న - mlc elections
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తీన్మార్ మల్లన్న అన్నారు. పట్టభద్రులు తనను ఆదరించాలని కోరుతూ హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
![ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రశ్నించే వారికి పట్టం కట్టాలి: తీన్మార్ మల్లన్న teenamar mallanna graduate mlc election compaign in warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9449344-421-9449344-1604637745205.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే వారికి పట్టం కట్టాలి: తీన్మార్ మల్లన్న
గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏం చేయకపోగా.. ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించారని ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగాలు లేక చాలా మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. తెరాస ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ప్రభుత్వ భూముల్లోని పేదల నివాసాల కూల్చివేత.. ఆందోళనలో బాధితులు