తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షయవ్యాధి అంతం... మన పంతం - rural

క్షయవ్యాధిని నివారించాలని వరంగల్​లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీబీ అంతం మన పంతం అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు.

క్షయవ్యాధి నివారణపై అవగాహాన ర్యాలీ

By

Published : Mar 24, 2019, 12:07 PM IST

క్షయవ్యాధి నివారణపై అవగాహాన ర్యాలీ
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని వరంగల్​లో నర్సింగ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకతీయ వైద్య కళాశాల నుంచి ప్రదర్శన కూడలి వరకు సాగింది. వరంగల్ అర్బన్ వైద్య అధికారి హరీశ్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు.

టీబీ అంతం మన పంతం...

క్షయ వ్యాధిని నివారించాలని, టీబీ అంతం మన పంతం అంటూ దారిపొడవునా నినాదాలు చేశారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:కేయూలో ఎన్​ఎస్​ఎస్​ ఓటు అవగాహన సదస్సు

ABOUT THE AUTHOR

...view details